ఎపి ఎడ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Apr 20,2024 08:31 #ap ed set, #notification, #released

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :2024-25 విద్యా సంవత్సరానికిగాను బిఇడి, బిఇడి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అభ్యసించాలనుకునే వారి నిమిత్తం ఎపి ఎడ్‌సెట్‌ – 2024 నోటిఫికేషన్‌ను ఆంధ్ర యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. ఈ అర్హత పరీక్షకు ఆసక్తిగల విద్యార్థులు సాధారణ రిజిస్ట్రేషన్‌ ఫీజుకు సంబంధించి ఒసిలు రూ.600, బిసిలు రూ.500, ఎస్‌సి, ఎస్‌టిలు రూ.450 చెల్లించి మే 15వ తేదీలోగా ఆంధ్ర యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లింక్‌https://cets.apsche.ap.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాలని ఎపి ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ టివి.కృష్ణ తెలిపారు. మే 16 నుంచి 19 వరకు రూ.2 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు బిఎ, బిఎస్‌సి, బిఎస్‌సి హోమ్‌ సైన్స్‌, బిఎఒఎల్‌, బికాం, బిసిఎ, బిబిఎం, బిఇ, బిటెక్‌ ఉత్తీర్ణులైన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు అర్హులని తెలిపారు. ఈ అర్హత పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంటర్లలో జూన్‌ 8న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. మే 30వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 7659934669 నెంబరును సంప్రదించాలని కోరారు.

➡️