ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు కుట్రా : ఎపి రైతు సంఘం

Dec 8,2023 20:06 #Rythu Sangham, #Smart Meters
ap rythu sangham on smart meters

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ప్రతిఘటిస్తాం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్రలు చేస్తోందని, దొడ్డిదారిన రైతులను మభ్యపెడుతూ మీటర్లను పెడితే ప్రతిఘటిస్తామని ఎపి రైతు సంఘం పేర్కొంది. విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్పిన ప్రతి అంశానికీ తలూపుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసేందుకే కేంద్రం చెప్పినట్లు వ్యవసాయ మీటర్లకురాష్ట్ర ప్రభుత్వం మీటర్లను పెడుతోందని విమర్శించారు. శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టును పెట్టినపుడు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. ఇప్పుడు మోటార్లకుమీటర్లు పెట్టేందుకుమళ్లీ పూనుకోవడం తగదన్నారు. అనంతపురం, కరూులు, నంద్యాల జిల్లాల్లో ఈ మేరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టుకోవాలని విద్యుత్‌శాఖాధికారులు సమావేశాలు వేసి చెబుతున్నారని తెలిపారు. వ్యవసాయానికి వాడుకును ప్రతి హెచ్‌పికీ రూ1,150 మీ ఖాతాల్లో జమచేస్తామని కొన్ని మండలాల్లో రైతుల నుండి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్నారని అన్నారు. రైతులకుఎనిు బోర్లు వుంటే.. అనిుంటికీ ఇస్తామనిచెబుతునాురని, ఆచరణలో గ్యాస్‌ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం మోసం చేసినట్లుగానే ఉచిత విద్యుత్‌లోనూ మోసం జరుగుతుందనిఆందోళన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వ్యవసాయ పంపుసెట్లపై రైతులు ఆధారపడుతున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తే కరువు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నగదు బదిలీ పేరుతో రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. తక్షణం మోటార్లకుమీటర్లను పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవసాయ కనెక్షన్‌లకుమీటర్లు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

➡️