ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాలి : ‘ఆశా’ డిమాండ్‌

Apr 27,2024 22:25 #asa workers, #demand
anganwadi workers strike 28th day prakasam

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీ, ఆయూష్మాన్‌ భారత్‌తో పాటు, ఇతర ఆరోగ్య పథకాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రయివేటు ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం ‘ఆశా’ ఉపాధ్యక్షులు డాక్టర్‌ వై రమేష్‌ బాబు, కార్యదర్శి అవినాష్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆరు నెలల నుంచి ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించడం లేదని, దాదాపు రూ.1200 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ బిల్లులను ఏ నెలకు ఆ నెల చెల్లించడం లేదని, దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారుతోందని తెలిపారు. ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️