ఆశాలపై ఉక్కుపాదం

Feb 9,2024 08:14 #Asha Workers, #CITU, #Protest, #YCP Govt
asha workers chalo vijayawada arrest gnt aa
  • కార్యాలయాలకు తాళాలు వేసి నిర్బంధించిన పోలీసులు
  • పగులకొట్టుకుని దూసుకొచ్చిన ఆశాలు
  • వడ్డేశ్వరం, మంగళగిరిలో జాతీయ రహదారిపై రాస్తారోకో

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జిల్లాలోనే ముందస్తు అరెస్ట్‌లు చేసిన ప్రభుత్వం గురువారం నాడు కూడా విజయవాడకు రానీయకుండా పరిసర ప్రాంతాల్లో అడ్డుకుంది. దీంతో తాడేపల్లి, వడ్డేశ్వరం, మంగళగిరి ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ ఆశాలు భైఠాయించారు. రాస్తోరోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో బలవంతంగా అరెస్ట్‌లు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు. అంతకుముందు బుధవారం రాత్రి చర్చల్లో పాల్గని బయటకు వస్తున్న ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మిని, ఇతర నాయకులను మంగళగిరిలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం బయటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చర్చలకు రమ్మని పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్టు చేయించిన ప్రభుత్వం తీరుపై సిపిఎం, సిఐటియు రాష్ట్ర కమిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ తరువాత కూడా ప్రభుత్వ నిర్బంధం కొనసాగింది. వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లో ఉన్న ఆశా వర్కర్లను బయటకు రానీయకుండా బుధవారం రాత్రే పోలీసులు తాళాలు వేశారు. వడ్డేశ్వరం కెబి భవన్లోనూ ఆశావర్కర్లను నిర్బంధించారు. తాళాలు తీయాలని ఎంత బతిమిలాడినా తీయకపోవడంతో ఆశాలు గేట్లు, గోడదూకి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వారు తాళాలు పగులకొట్టడంతో మిగిలిన వారు బయటకు వచ్చేశారు. ఊహించని పరిణామంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. అక్కడ నుండి పరుగు పరుగున జాతీయ రహదారిపైకి చేరుకుని నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు గంటపాటు రెండువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అనంతరం పోలీసులు సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పోచమ్మ తదితరులను అరెస్టు చేసి వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు. అదే సమయంలో మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఐద్వా నాయకులు రమాదేవి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు నేతాజీ, వెంకటేశ్వరరావు, కమల ఆధ్వర్యాన ఆశాలు బైఠాయించారు. అక్కడ కూడా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరితే చర్చలకు పిలిచి అరెస్టు చేయడం ఏం ప్రజాస్వామ్యమని నాయకులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సమయంలో పెనుగులాట జరిగింది. నాయకులతోపాటు పలువురు మహిళలు రోడ్డుపై పడిపోయారు. అరెస్టు చేసిన వారిని గుంటూరు, మంగళగిరి, తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో స్టేషన్లకు, కళ్యాణ మండపాలకు తరలించారు. వడ్డేశ్వరం వద్ద అరెస్టయిన వారిలో సిఐటియు నాయకులు సుబ్బరావమ్మ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పోశమ్మతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు డి.జ్యోతి, సిహెచ్‌.లక్ష్మి, సౌభాగ్య తదితరులు ఉన్నారు. మంంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వద్ద అరెస్టయిన వారిలో సిఐటియు నాయకులు సాయిబాబు, జె.వి.రాఘవులు, డి.వెంకటరెడ్డి, ఎం.రవి, భాగ్యరాజు, బి.లక్ష్మణరావు, బాలాజీ, గుంటూరు జిల్లా నాయకులు ధనలక్ష్మి ఉన్నారు. కార్యాలయాల్లోకి చొరబాటుఆశాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు సిఐటియు ప్రజా సంఘాల కార్యాలయాల్లోకి చొరబడ్డారు. దుర్గాపురంలోని సిఐటియు కార్యాలయంలోకి పోలీసులు నేరుగా వెళ్లి ఆశా నాయకులను లాక్కొచ్చేందుకు ప్రయత్నించగా, సిఐటియు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బయటకు వెళ్లారు. అలాగే వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల కార్యాలయాల్లోకి వెళ్లడంతోపాటు వాటి గేట్లకు తాళాలు కూడా వేశారు. పోలీసుల తీరును సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్‌ తీవ్రంగా ఖండించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండనతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో నోటీసులిచ్చి అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు. వైద్య, కుటుంబ ఆరోగ్యశాఖ అదికారులు చర్చలకు రావాలని పిలిచి, నాయకులను అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. వందలాది మంది ఆశా కార్యకర్తలు కాలకృత్యాలు తీర్చుకుంటున్న భవనానికి తాళాలువేసి బంధించడం దారుణమని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు కనీస వేతనం, సెలవులు, మెటర్నటీ లీవులు, రిటైర్‌మ్‌ెం బెనిఫిట్స్‌, పనిభారం తగ్గించాలని తదితర కోర్కెలతో గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ప్రశాంతంగా ధర్నాకు వస్తున్న ఉద్యోగులను అరెస్టు చేసి శాంతిభద్రతల సమస్యగా చేయడం సరైందికాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నాయకులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీల ఖండనఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేబీరాణి, కె.సుబ్బరావమ్మ ప్రకటన విడుదల చేశారు. అర్ధరాత్రి భర్త, పిల్లల ముందు ఆశా వర్కర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రైతు, కౌలురైతు సంఘాల ఖండనఆశా వర్కర్ల అరెస్టులను ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు తీవ్రంగా ఖండించారు.

మార్కాపురం పోలీస్ స్టేషన్ ముందు ఆశావర్కర్ల నిరసన
పొదిలి మండలం ఉప్పలపాడు పి.హెచ్.సి.లో ఆశాల అక్రమ అరెస్టులు.. ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ ధర్నా

విశాఖ : ఆశా కార్మికుల అక్రమ అరెస్టులను ఆపాలని, ప్రభుత్వ నిర్బంధం ఆపాలని, న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జగదాంబ సీఐటీయూ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం..

నేషనల్ హైవే 16 దిగ్బంధనం – మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదురుగా ఆశా వర్కర్లు

కంచికచర్ల పోలీస్‌ స్టేషన్లో ఆశాల ఆందోళన

ఆశ వర్కర్ల మహా ధర్నా నేపథ్యంలో సిపిఎం సిఐటియు ఆశ వర్కర్స్ యూనియన్ నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తూ, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ సిఐటియు కార్యాలయం నుంచి టూ టౌన్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి స్టేషన్ ముందు బైఠాయించిన ఆశ వర్కర్లు.

చాట్రాయి మండల పోలీస్ స్టేషన్లో40 మంది ఆశా కార్యకర్తలను విజయవాడ ధర్నాకు వెళ్లకుండా నిర్బంధ అరెస్టు చేసిన పోలీసులు. చాట్రాయి మండలం.

చింతలపూడి మండలం తమ న్యాయమైన డిమాoడ్లు కోసం ఛలో విజయవాడకి వెళ్తున్న ఆశ వర్కర్ అక్రమంగా అరెస్ట్ చేసే పోలీస్ స్టేషన్ నిర్బంధించడంపై సిఐటి నాయకులు మండిపడ్డారు.

నరసాపురం రూరల్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసిన ఆశా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి అని స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన నరసాపురం టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు
ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద రోడ్డుపై జరుగుతున్న జరుగుతున్న ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించండి అంటే అరెస్ట్ లా.. : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

ఆశా వర్కర్ ఆవేదన…

ఆశా వర్కర్ల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.. : సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు

 

మంగళగిరి : ఆశ కార్మకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. చర్చలకు పిలిచి ఆశ యునియన్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆశలు మంగళగిరి DMA కార్యలయానికి NRI వద్ద నుండి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపై భైటాయించారు.

విజయవాడ  : చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లని విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దారి మళ్లించి సుమారు యాభై కిలోమీటర్ల వరకు ఆశ వర్కర్లు తరలిస్తున్న విజయవాడ పోలీసులు. భోజనాలు, మహిళలకు అత్యవసర సమయంలో కూడా బస్సుని ఆపకుండా తరలిస్తున్నారని ఆశా వర్కర్లు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం బూర్జి పీహెచ్ నుంచి 14 మంది గుత్తా వెళ్లి పీహెచ్ఈ నుంచి 18 మంది వెళ్లినట్లు సమాచారం.

asha workers chalo vijayawada arrest gnt aaa

గుంటూరు జిల్లా : ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నారై దగ్గర ధర్నా చేస్తున్నసందర్భంగా పల్నాడు జిల్లా ఆశా వర్కర్లను అరెస్టు చేసి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు.

 

ఎన్టీఆర్ జిల్లా-మైలవరం : ఆశ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నేడు చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళకుండా ఆశాలు, సిఐటియు నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి మైలవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. సిఐటియు నేత సిహెచ్ సుధాకర్ను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన ఆశాలు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కోసం వెళ్తుంటే ఆశాలను, నాయకులను అరెస్టులు చేయటం అప్రజాస్వామికమని, ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

asha workers chalo vijayawada arrest prakasam

ప్రకాశం జిల్లా : ఆశా వర్కర్స్ ఛలో విజయవాడ కార్యక్రమానికి ముందస్తు అరెస్టులు

సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యం.రమేష్ ను పొదిలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పోలీసులు.
సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు, సిఐటియు నగర నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు

 

వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ సెంటర్ వద్ద పోలీసులను ప్రతిఘటించి గేట్లు దూకి విజయవాడ గుంటూరు హైవే పై బైఠాయించిన ఆశా వర్కర్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల నిర్భంధాలు… అరెస్టులు…

 

 

 

 

asha workers chalo vijayawada arrest mng

  • ఎన్నారై హాస్పిటల్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన ఆశా వర్కర్లు

మంగళగిరి : ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. దీంతో వందలాదిమంది ఆశా వర్కర్లు ఏపీఐఐసీసీ భవనముల గల కార్యాలయానికి వెళ్లేందుకు ఆశా వర్కర్లు బయలుదేరారు. నిలుపుదల చేయడంతో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు మోహరించారు.

 

asha workers chalo vijayawada arrest pksm a

ప్రకాశం జిల్లా : ఆశ వర్కర్ల డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళనీకుండా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను, ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేసి ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆశా వర్కర్స్ నాయకురాలు  కత్తి తిరపతమ్మ, వ్యవసాయ కార్మిక నాయకులు వెల్లంపల్లి ఆంజనేయులు,  రైతు సంఘం నాయకులు పంట ఏడుకొండలు

 

asha workers chalo vijayawada arrest kkd

కాకినాడ జిల్లా : కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఆశాలు, అఖిల పక్షం.

asha workers chalo vijayawada arrest tdpl

పశ్చిమ గోదావరి జిల్లా-తాడేపల్లిగూడెం: చలో విజయవాడ ధర్నా కార్యక్రమనికి వెల్లుచున్న అత్తిలికి, తణుకు, పెంటపాడు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన 40 మంది ఆశా కార్యకర్తలను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో అడ్డుకుని తాడేపల్లిగూడెం టౌన్ పోలీసు స్టేషన్లో నిర్బంధించిన పోలీసులు

పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో ఆశాలు నిర్బంధం
పశ్చిమ గోదావరి జిల్లా – పాలకొల్లు : విజయవాడలో ఆశాల ఆందోళన కార్యక్రమంకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కు వెళ్లిన 53 మంది ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, ఆచంట మండలాలకు చెందిన వీరిని గురువారం ఉదయం విజయవాడ వెళ్ళే ఫాస్ట్ పాసింజర్ ఎక్కకుండా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచారు. వీరితో పాటు సిఐటీయు నేతలు జవ్వాది శ్రీనివాస్,దేవ సుధాకర్ లను పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

 

ప్రకాశం జిల్లా : చీకటి శ్రీనివాసరావు గృహ నిర్బంధం

 

➡️