ఎన్నికల విధులకు వెళ్తుండగా ఎఎస్‌ఐ దుర్మరణం

May 20,2024 08:31 #death, #police

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఎన్నికల బందోబస్తు విధులకు వెళ్తుండగా ఎఎస్‌ఐను కారు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం ప్రకారం… విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఇవిఎంలను ఇబ్రహీంపట్నంలోని నోవా, నిమ్రా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా జూపూడి వద్ద, ఖిల్లా రోడ్డు వద్ద రెండు పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఇవిఎంల భద్రతా విధులు నిర్వహించేందుకు శనివారం రాత్రి జూపూడి పోలీసు చెక్‌పోస్ట్‌ వద్దకు వెళుతూ రోడ్డు దాటుతున్న విజయవాడ సిసిఎస్‌ పోలీస్‌స్టేషన్‌ ఎఎస్‌ఐ ఎన్‌.వి.వి.రమణ (62)ను కారు ఢకొీట్టింది. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని జిల్లా పోలీసు కమిషనర్‌ రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

➡️