తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డితో బాలయ్య భేటీ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ప్రముఖ నటులు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం జూబ్లిహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో వారు సుమారు గంట సేపు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తీరు, ఆయా పార్టీల విజయావకాశాలపై చర్చించుకున్నారు. బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలను ముఖ్యమంత్రికి బాలకృష్ణ వివరించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా కేన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, బసవతారకం ఆస్పత్రికి అన్నివిధాలుగా రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. బాలకృష్ణ వెంట బసవతారకం ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ కె కృష్ణయ్య, డాక్టర్‌ జె శివరాంప్రసాద్‌ ఉన్నారు.

➡️