13 నుంచి బలయ్య బస్సు యాత్ర

Apr 12,2024 15:23 #2024 elections, #Balakrishna, #bus tour

ప్రజాశక్తి-అమరావతి : గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. బాలయ్య అన్‌స్టాపబుల్‌ అని బస్సుపై ప్రత్యేక క్యాప్షన్‌ ఇచ్చారు. శనివారం నుంచి ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఏప్రిల్‌ 19న హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకష్ణ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈనెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహించనున్నారు.

➡️