జనసేనకు బొంతు రాజేశ్వరరావు రాజీనామా!

రాజోలు: ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని నేతలు మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని ఆశించిన బంతు రాజేశ్వరరావు.. బుధవారం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బీఫామ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ దేవ వరప్రసాద్‌కు ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యారు. అనంతరం కేడర్‌తో చర్చలు జరిపిన ఆయన జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనకు గుడ్‌ బై చెప్పి రేపు జగన్‌ సమక్షంలో కాకినాడలో సొంత గూటికి బంతు రాజేశ్వరరావు చేరునున్నారు.

➡️