బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్ర రీ షెడ్యూల్‌..

May 2,2024 15:15 #Bus Trip, #ex cm kcr, #sedule

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రను బీఆర్‌ఎస్‌ శ్రేణులు రీషెడ్యూల్‌ చేశారు. కేసీఆర్‌ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్‌ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 8 గంటలకు గడువుముగియనుంది. అయితే.. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్‌ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుంది.

కేసీఆర్‌ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు
– 03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో
– 04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో
– 05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో
– 06.05.24 సాయంత్రం నిజామాబాద్‌ రోడ్డు షో
– 07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్‌ లో రోడ్డు షో
– 08.05.24 నాడు నర్సాపూర్‌ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో
– 09.05.24 నాడు కేసీఆర్‌ బస్సు యాత్ర కరీంనగర్‌ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం
– 10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ,అనంతరం కేసీఆర్‌ బస్సు యాత్ర ముగుస్తుంది.
అసలు ఏం జరిగింది..
ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. మే 1 (నేడు) రాత్రి నుంచి 48 గంటల పాటు బీఆర్‌ఎస్‌ చీఫ్‌ ప్రచారానికి ఈసీ బ్రేక్‌ వేసింది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌ పార్టీపై కేసీఆర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది. కేసీఆర్‌ బస్సుయాత్రలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్‌ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేధం అమల్లో ఉంటుంది. బస్సు యాత్రలో కేసీఆర్‌ 5 సార్లు అసభ్య పదజాలం వాడారని ఎన్నికల సంఘం తెలిపింది. నీటి విలువ తెలియని లత్కోర్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుక్కల కొడుకులు వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని ఆరోపించారు. రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వకుంటే గొంతు కోస్తామని కేసీఆర్‌ తన ప్రచారంలో అన్నారు. ఈ మాటలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

➡️