సహాయక చర్యలపై దృష్టిపెట్టాలి : చంద్రబాబు

chandrababu on cyclone effect

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంపై మిచౌంగ్‌ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం తగురీతిలో స్పందించలేదని విమర్శించారు. ధాన్యాం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలన్నారు. టిడిపి కార్యకర్తలు, నేతలు తుపాను బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : లోకేష్‌తుపాను ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మరో ప్రకటనలో సూచించారు. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. తుపాను తీవ్రత దృష్ట్యా యువగళం పాయదాత్రకు విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు.

➡️