సిఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పా : చంద్రబాబు

అమరావతి : సిఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పానంటూ … ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని చంద్రబాబు ఆరోపించారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని, తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని అన్నారు. సిఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పాననీ… కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని అన్నారు. ప్రజలంతా గమనించి తనను గౌరవ సభకు పంపారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

➡️