కౌరవ మూకను తరిమికొట్టాలి : చంద్రబాబు

అమరావతి : మే 13న కౌరవ మూకను తరిమికొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌)లో శనివారం పోస్టు చేశారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం ఎపిలో అరాచక పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఇలాంటి కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మోసపు పునాదులపై జగన్‌ నిర్మించుకున్న అప్రజాస్వామిక సామ్రాజ్యం మరి కొద్ది రోజుల్లో కూలిపోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️