నేడు సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Jan 13,2024 11:06 #CID, #Nara Chandrababu

ప్రజాశక్తి-అమరావతి: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఆయన కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు శనివారం పూచీకత్తుతో పాటు రూ.లక్ష విలువ గల బాండ్‌ సమర్పించనున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు గుంటూరు నగరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళతారు. సాయంత్రం 4:20 గంటలకు తాడేపల్లి, 5:05 గంటలకు తాడిగడపలోని సీఐడీ కార్యాలయాలకు కూడా వెళి పూచీకత్తులు సమర్పించనున్నారు.

➡️