శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. రోజురోజుకూ యాంత్రికుల సంఖ్య పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఉచిత మంచినీళ్లు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసినవారికి శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం, ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ సందర్శకులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్‌ ఉంది.
తిరుమల శ్రీవారిని శుక్రవారం 67,873 మంది సందర్శకులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

➡️