టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసిపి నేత

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం వైసిపి నాయకులు మల్లెల రాజేష్‌ నాయుడు శుక్రవారం మంగళగిరిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. గతేడాది డిసెంబరు నుంచి గతనెల వరకు వైసిపి చిలకలూరిపేట నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన వ్యవహరించారు. టికెటు కోసం మంత్రి విడుదల రజని తన వద్ద రూ.ఆరున్నర కోట్లు తీసుకుందని ఆరోపణలు చేయడంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి రాజేష్‌ను వైసిపి తప్పించింది. ఆ స్థానంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిని నియమించింది. అతనికే టికెటును కేటాయించింది. దీంతో రాజేష్‌నాయుడు, పది మంది పట్టణ కౌన్సిలర్లు, పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు టిడిపిలో చేరారు.

➡️