శ్రీసిటి ఎమ్‌డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సిఎం

Dec 14,2023 10:36 #ap cm jagan

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుపతిలోని తాజ్‌హోటల్‌ నందు జరిగిన శ్రీసిటి ఎమ్‌డి రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు బుధవారం సాయంత్రం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధువు నిరీష, వరుడు సాగర్‌లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా, తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, అధికారులు సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు.

➡️