చింతపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ చేసిన సీఎం జగన్‌

Dec 21,2023 22:18 #ap cm jagan
  •  9 వేలకు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్‌లు అందజేత

ప్రజాశక్తి-చింతపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందజేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్‌ చెప్పారు. ఈ ఏడాది రూ.620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్‌ లను అందించనున్నట్లు తెలిపారు. ఈ ట్యాబ్‌లలో రూ.15,500 విలువైన బైజూస్‌ కంటెంట్‌ను ప్రిలోడెడ్‌గా ఇస్తున్నామని, ట్యాబ్‌ ధర రూ.17,500 తో కలిపి ప్రతీ విద్యార్థికి రూ.33 వేల మేర లబ్ది కలుగుతుందని చెప్పారు.

➡️