లండన్‌ పర్యటనలో సిఎం రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ : లండన్‌ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి ఎద్దేవా చేశారు.

లండన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడుతూ … బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్‌ ఎన్నిల్లోనూ రిపీట్‌ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. లండన్‌ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ ధ్వజమెత్తారు. సిఎం రేవంత్‌ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పింది ఒకటి అని, అవి చూసి జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. కారు పార్టీని బొంద పెడతామంటూ రేవంత్‌ చౌకబారు మాటలు మాట్లాడారని అన్నారు. కెసిఆర్‌ సంగతి చూస్తానన్న రేవంత్‌…గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయారని, తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించారంటూ నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

➡️