యుటిఎఫ్ నేత ఎకె దత్‌కు విఎస్ఆర్ నివాళి

Dec 3,2023 15:30 #passed away, #utf, #V Srinivasarao
utf leader dattu

ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : అనారోగ్యం కారణంగా మృతి చెందిన యుటిఎఫ్ సీనియర్ నాయకులు అక్షయ కుమార్ దత్, (77) భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎపి యుటిఎఫ్ నేతలు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం దత్ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం అశోక్ నగర్ లోని యుటిఎఫ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ వి ఎస్ ఆర్ తో పాటు ఉమ్మడి రాష్ట్ర యు టి ఎఫ్ అధ్యక్షులు జోజయ్య, ఎపి యుటిఎఫ్ ప్రచార కమిటీ చైర్మన్ తాండవ కృష్ణ, పత్రిక ప్రధాన సంపాదకులు కుమార రాజా, ఎన్టీ ఆర్ జిల్లా యుటిఎఫ్ నాయకులు సుందరయ్య, రంగారావు, కోటేశ్వరరావు తదితరులు దత్ కు నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని అల్వాల్ లోని దత్ స్వగృహానికి కుటుంబసభ్యులు తరలించారు. దత్ పార్థివ దేహాన్ని చిలుకూరులోని భాస్కర మెడికల్ కాలేజీ కి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️