రన్‌ వే పైకి వచ్చి మళ్ళి టేకాఫ్.. ఇండిగో విమానంలో గందరగోళం..!

Jan 30,2024 12:57 #flights, #gannavaram airport
  • గన్నవరం ఎయిర్పోర్ట్‌లోఘటన

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం ఎయిర్పోర్ట్‌ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌ వే పైకి వచ్చిన విమానం మళ్ళీ గాల్లోకి ఎగిరింది. దీంతో కుదుపులకు గురై విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 20నిమిషాలపాటు గాల్లోనే చెక్కర్లు కొట్టిన విమానం. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ విమానంలో నారా భువనేశ్వరి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️