ఓట్ల పండగకు పయనం

  • హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు…
  • టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది.

ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో స్తిర పడిన ఆంధ్ర వాసులు సొంతూల్లకు బయలుదేరారు. శని, ఆదివారంతో పాటు, పోలింగ్ రోజున సోమవారం కూడా శెలవు కావటంతో ఓటు హక్కు వినియోగించుకునేందూకు కుటుంబ సభ్యులతో సహా బయలుదేరారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుండి హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఆర్టీసి తో పాటు ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులను పెంచాయి. అలాగే సొంతకార్లలో బయలుదేరటంతో హైదరాబాద్ నుండి కోదాడ వరకు, ఆంధ్ర ప్రాంత బోర్డర్ లో గరికపాడు చెక్ పోస్టు నుండి జగ్గయ్యపేట నందిగామ, కంచికచర్ల, మీదగా విజయవాడ వరకు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ లోని టోల్ గేట్ల తో పాటు ఆంధ్ర లోని చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్ది ఏర్పడింది. ఈ ఎన్నికల ను రాజకీయ పార్టీలతో పాటు, ఓటర్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎన్నికల కు ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.

➡️