నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి

– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పోలీసుల సాయంతో పోటీ కార్మికులను ఆదివారం కూడా రంగంలోకి దింపింది. గ్యారేజీల నుంచి వారు చెత్త వాహనాలను బయటకు తీస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ పక్కకు లాగిపారేశారు. పలువురిని అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో సమ్మెను ఆపలేరని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కంచాల్సిన ప్రభుత్వం పోటీ కార్మికులను తీసుకురావడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరింది.విశాఖలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాగా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనికి ధర్మశ్రీ స్పందిస్తూ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జివిఎంసి ఏడో వార్డు పరిధిలోని నగరంపాలెం రహదారిలో కంఫర్ట్‌ బిన్‌ వాహనాలను పోలీసుల సమక్షంలో పోటీ కార్మికులు బయటకు తీసేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, సిఐటియు నాయకులకు మధ్య తోపులోట జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జోన్‌ కార్యదర్శి రాజ్‌కుమార్‌, సూరిడమ్మ అస్వస్థతకు గురయ్యారు. ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కొద్దిసేపటి తరువాత విడిచిపెట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అధికారులు పోటీ కార్మికులతో పారిశుధ్య పనులు చేయిస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డుమీద ఈడ్చివేశారు.ఈ క్రమంలో ఉమా, కుమారి అనే మహిళా కార్మికులు సొమ్మిసిల్లి పడిపోయారు. 11 మంది కార్మికులను అరెస్టు చేసి టుటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికారులు వంద మందికిపైగా పోటీ కార్మికులు విధుల్లోకి రాగా మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. సమ్మెలో పాల్గనని మున్సిపల్‌ కార్మికులతో పని చేయించుకుంటే అభ్యంతరం లేదని, పోటీ కార్మికులను పనిలోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్‌ను పట్టించుకోకుండా మున్సిపల్‌ కమిషనర్‌ కారు ఎక్కి వెళ్లిపోతుండగా మున్సిపల్‌ కార్యాలయానికి గేట్లు మూసి అడ్డుకున్నారు. పలువురు కార్మికులు ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలిపారు. పోటీ కార్మికులతో పని చేయించబోమని మున్సిపల్‌ కమిషనర్‌ హామీ ఇవ్వడంతో శాంతించారు. పిడుగురాళ్లలో పోటీ కార్మికులతో పనిచేయిస్తుంటే సమ్మెలో పాల్గన్న కార్మికులు అడ్డుకున్నారు. అనంతపురంలో చెత్తను తొలగించేందుకు ప్రయివేటు వ్యక్తులు రాగా కార్మికులు అడ్డుకొని పంపేశారు. ప్రయివేటు వ్యక్తులతో చెత్తను తరలించే ఏర్పాటు చేస్తే కార్పొరేషన్‌ కార్యాలయంలోనే చెత్తను వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చెత్త తొలగించేందుకు వచ్చిన కమిషనర్‌ను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ దగ్గర మున్సిపల్‌ కార్మికులు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రయివేటు సిబ్బందిని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో సిఐటియు నాయకులు మహేష్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నెల్లూరులో సమ్మెను భగం చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు కార్మికులపై కక్ష సాధింపులు, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం విధుల నుంచి తొలగిస్తామంటూ 12 మందికి నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం, కడప, తిరుపతి, నెల్లూరు, ఎన్‌టిఆర్‌, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో నోటికి నల్ల రిబ్బన్లు, అర్ధనగ ప్రదర్శన, మోకాళ్లపై కూర్చొని, గడ్డితింటూ నిరసన తెలిపారు.

 

  • రణరంగంగా మారిన కొండపల్లి

 

  • సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు విశాల మద్దతు

అమరావతి : రాజధాని ప్రాంత మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకున్న ప్రభుత్వం పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంతో వార్డుల్లో చెత్త పేరుకు పోయి, కుళ్ళి కంపు కొడుతూ దుర్గంధం వెదజల్లుతున్న దని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేసిన ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాలను కూడా గాలికి వదిలేసిందా అని రవి ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉండే ఎంటిఎంసి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న విలీన గ్రామాల మున్సిపల్ కార్మికులకు జీవోలు అమలు జరపకుండా, కేవలం 12 వేల రూపాయలతో సరిపెడుతున్నారని కనీసం మున్సిపల్ కార్మికులకు యూనిఫాం, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, మాస్కులు, గ్లౌజులు ఏమి ఇవ్వడం లేదని అన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వారికి 26 వేల రూపాయలు జీతం చెల్లించాలని రవి డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఆలా శివాజీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ఎంటీఎంసీ విలీన గ్రామాలలో కార్పొరేషన్ పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తూ, కార్మికులకు జీతాలు సక్రమంగా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

 

municipal workers strike 6th day kakinada

  • 6వ రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె

కాకినాడ – పెద్దాపురం :  ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మున్సిపల్ వర్కర్స్ నిరవధిక సమ్మె ఆదివారం 6 వ రోజుకు చేరుకుంది.స్థానిక మున్సిపల్ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే సమ్మెను పరిష్కరించవలసింది పోయి పోటీ కార్మికులను పెట్టి పని చేయించే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు.కార్మికుల మధ్య గొడవలు, కొట్లాటలు పెట్టేందుకు అధికారులు, ప్రభుత్వం ప్రయత్నించటం దారుణ మన్నారు.ఇప్పటికే అనేక చోట్ల మున్సిపల్ కార్మికులు పోటీ కార్మికులను అడ్డుకున్నారన్నారు.తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.కనీస వేతనాల కోసం,ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకోటి అప్పారావు,భూపతి శ్రీను,మడికి కృష్ణ,చేపల అర్జయ్య,వర్రే రాజేష్,మడికి మోహన్ రావు,దోనం దేవి ప్రసాద్,దొండపాటి సురేష్,దొండపాటి శేఖర్,వర్రె రమణ,సురేష్,పలివెల అప్పారావు,దొండపాటి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

 

municipal workers strike 6th day atp

  • దిగివచ్చిన పాలకవర్గం అధికార యంత్రాంగo…

అనంతపురం జిల్లా  :  కోవిడ్ మలేరియా గార్బేజ్ కార్మికులకు 15000 వేతనం ఇస్తాం, పదవీ విరమణ చేయించిన పదిమంది ఇంజనీరింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తాం, చెత్త తరలింపుకు సహకరించండి అంటూ పాలకవర్గం అధికారులు విజ్ఞప్తి చేశారు. వారి కల్లబొల్లి కబుర్లు మాటలు నమ్మం అని తెలిపారు. రాష్ట్ర కమిటీ ప్రభుత్వంతో జరిపే చర్చలకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం తేల్చి చెప్పింది. దురుసుగా వ్యవహరించిన కార్పొరేటర్ల అనుచరులను కట్టడి చేయాలని కోరారు.

 

municipal workers strike 6th day sklm

 

  • అన్ని వర్గాలను మోసం చేసిన జగన్

శ్రీకాకుళం-ఆమదాలవలస :  రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని టిడిపి జిల్లా అధ్యక్షుడు మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద పారిశుద్ధ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర పేరుతో ఉద్యోగులకు అలవి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక తీరా వారిని నట్టేట ముంచారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు పాదయాత్రలో అధికారంలోకి వచ్చాక పర్మినెంట్ చేస్తామని నమ్మించి వారి ఓట్లతో గెలిచి తీరా అధికారంలోకి వచ్చాక వారికి పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు పారిశుద్ధ్య కార్మికులకు అందేవని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సనపల డిల్లేశ్వరరావు, యండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

municipal workers strike 6th day kondapalli

  • రణరంగంగా మారిన కొండపల్లి

కొండపల్లి మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరం వద్ద రణరంగంగా మారింది. కార్మికులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేస్తున్నారు. ‘మేము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నాం… ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటూ కార్మికులు పోలీసులను నిలదీశారు. శనివారం రాత్రి నుండే ఈ శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శిబిరం వద్దకు వచ్చిన వైసిపి నాయకులు, పోలీసులపై కార్మికులు ఆగ్రహించారు.

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్తని తొలగించడానికి వేరే వర్కర్ ని తీసుకువచ్చి పని చేయించేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధి పోలీసు వారి సహకారంతో శిబిరం వద్దకు రాగా మున్సిపల్ కార్మికులు మా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న సమయంలో ఇలా అర్ధరాత్రి సమయంలో బలవంతంగా వేరే కార్మికులతో పని చేయించడానికి తీవ్రంగా అడ్డుకున్నారు. ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్న మా గోడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఈరోజు ఇలా దొడ్డిదారిన పని చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజా ఆరోగ్యం కోసం పని చేశామని, కానీ నేడు మాకు రావలసిన న్యాయమైన డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న మాపై ప్రజా ఆరోగ్యం పేరుతో నిర్బంధాలు చేయటం సబబు కాదని ఆందోళన దిగారు.

 

municipal workers strike 6th day kondapalli

చెత్త తరలించే వాహనాలను తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన అధికారులు, అడ్డుకున్న కార్మికులు

కొండపల్లి  : ఆదివారం ఉదయం ప్రైవేటు సిబ్బందితో పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ అధికారులను అడ్డుకున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు సిఐటియు నాయకులు మహేష్. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు సిబ్బందితో పని చేయించి తీరతామని కమీషనర్ హుకుం జారీ చేయడంతో తాము సమ్మె చేస్తున్న సమయంలో ఇలా ప్రైవేటు వాహనాల్లో ప్రైవేటు వ్యక్తులతో పని చేయించ వద్దంటూ బ్రతిమిలాడినా పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో సిఐటియు నాయకులు మహేష్ తోపులాటలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా ఉద్యమం చేసి తీరుతామని మున్సిపాలిటీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని సైతం పోలీసులు పీకేశారు.

municipal workers strike 6th day atp

 

అనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్మికుల అర్ధ నగ్న ప్రదర్శన

ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు: సిఐటియు

ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లుగా పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున అన్నారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర నిరవధిక సమ్మె ఆరవ రోజులో భాగంగా ఆదివారం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుండి శిబిరం వరకు అర్ధ నగ్నంగా ప్రదర్శన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేయడాన్ని మానుకొని తక్షణమే మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని లేనిపక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు రాము తిప్పేస్వామి మల్లేష్ తిప్పేరుద్ర మైలారప్ప నరసింహులు మరియు పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.

 

  • పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 

ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం జిల్లా) :  నగర పంచాయతీ పారిశుద్ద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ ముందు సమ్మె నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం రూ 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్,నాయకులు పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి,కార్మికుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

municipal workers strike 6th day mandapeta

  • పారిశుధ్య కార్మికులు అర్థనగ్న ప్రదర్శన

కోనసీమ-మండపేట : తమ సమస్యల తక్షణo పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది.  ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే. కృష్ణవేణి మాట్లాడుతూ నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తల రాతలు మారడంలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మరిన్ని సంఘాలను కలుపుకొని డిమాండ్ల సాధన లక్ష్యంగా సమ్మె ఉధృతం చేసేందుకు ముందుకు సాగుతున్నమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

municipal workers strike 6th day prakasam

  • మున్సిపల్ కార్మికుల అరెస్టు

ప్రకాశం-ఒంగోలు సబర్బన్ : మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఒంగోలు నగరంలో నగరపాలక సంస్థ అధికారులు పోటీ కార్మికులును రంగంలోకి దింపి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. వీధుల వెంట పోగు పడిన చెత్తను వాహనాలద్వారా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. శనివారం అర్ధరాత్రి కమిషనర్ వెంకటేశ్వరరావు, పలువురు పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు చెత్త తరలింపు వాహనాలను అడ్డుకున్నారు. కొప్పోలు రోడ్ లో గుత్తికొండ వారి పాలెం డంపింగ్ యార్డ్ కు వెళుతున్న చెత్త తరలింపు వాహనాలను కొప్పోల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కార్మికుల నిలిపివేశారు. మామిడిపాలెం తడి చెత్త పొడి చెత్త వేరు చేసే షెడ్డు కు తరలిస్తున్న వాహనాలను కూడా అడ్డుకున్నారు. డి ఆర్ ఆర్ ఎం మున్సిపల్ స్కూల్ దగ్గర నుండి చెత్త వాహనాలు బయటకు రాకుండా కార్మికులు అడ్డుగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొర్నిపాటి శ్రీనివాసరావు, సిఐటియు నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు ,పలువురు మహిళా కార్మికులు ఉన్నారు.

municipal workers strike 6th day

  • గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … గత ఐదు రోజులుగా సమ్మె చేపట్టిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి బదులుగా పోటీ కార్మికులను రంగంలోకి దించారు అధికారులు. దీంతో కడుపుమండిన కార్మికులు అధికారులను అడ్డుకున్నారు.

నరసరావుపేట లో డంపింగ్‌ లారీలను వెళ్లనీయకుండా మునిసిపల్‌ కార్మికులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిలార్‌ మసూద్‌ పోలీసులతో మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల స్థానంలో పోటీ కార్మికులను అధికారులు రంగంలోకి దించడం పట్ల మున్సిపల్‌ కమిషనరును కార్మికులు నిలదీశారు. పోటీ కార్మికులను పనిలోకి తీసుకోవద్దని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా మున్సిపల్‌ కమిషనర్‌ బయటికి వెళ్ళేందుకు కారు ఎక్కగా, కార్మికులు కారుకు అడ్డుపడి గేట్లు మూసి అడ్డుకున్నారు. పారిశుధ్య కార్మికులంతా వాటర్‌ ట్యాంకుపై ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోటి కార్మికులను పనిలోకి దించబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే పైనుంచి కిందకి దిగుతామని కార్మికులు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సిఎం హామీ ఇచ్చిన విధంగా సమానపనికి సమానవేతనం, ఉద్యోగాల పర్మినెంటు, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్కు అలవెన్సు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం, తదితర డిమాండ్లపై చేపట్టిన సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. కార్మికుల డిమాండ్లు నెరవేరేవరకు సమ్మెను విరమించేదేలేదని రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. నేటి నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మెను ఉధృతంగా చేపట్టారు.

 

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టౌన్ కొత్త రోడ్ దగ్గర నిన్న పోలీసులు అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నా మున్సిపల్ నాయకులు నూకరాజు ఎం సుబ్బారావు రాము కొండలరావు తదితరులు పాల్గొన్నారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టౌన్ కొత్త రోడ్ దగ్గర నిన్న పోలీసులు అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నా మున్సిపల్ నాయకులు నూకరాజు ఎం సుబ్బారావు రాము కొండలరావు తదితరులు పాల్గొన్నారు

నరసరావుపేట (గుంటూరు) : డంపింగ్‌ లారీలను వెళ్లనీయకుండా మునిసిపల్‌ కార్మికులు అడ్డుకొని నిరసన తెలిపారు. పారిశుధ్య కార్మికుల స్థానంలో పోటీ కార్మికులను అధికారులు రంగంలోకి దించడం పట్ల మున్సిపల్‌ కమిషనరును కార్మికులు నిలదీశారు. కార్మికులు కారుకు అడ్డుపడి గేట్లు మూసి అడ్డుకున్నారు. పారిశుధ్య కార్మికులంతా వాటర్‌ ట్యాంకుపై ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

anantapuram
anantapuram

అనంతపురం : మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కొందరు కార్పొరేటర్లు ప్రైవేటు ట్రాక్టర్లను పెట్టి చెత్తను అర్ధరాత్రి పూట తొలగించడాన్ని సిపిఎం ఒకటవ నగర కమిటీ సభ్యులు, మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు.

చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు
చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కార్మికుల సమ్మె కు సంఘీభావంగా క్లాప్ వాహన డ్రైవర్స్ ఆందోళన - ప్రజాశక్తి కాకినాడ
మున్సిపల్ కార్మికుల సమ్మె కు సంఘీభావంగా క్లాప్ వాహన డ్రైవర్స్ ఆందోళన – ప్రజాశక్తి కాకినాడ

 

manyam
manyam
ప్రజాశక్తి పొన్నూరు రూరల్
ప్రజాశక్తి పొన్నూరు రూరల్
➡️