అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Jan 10,2024 12:16 #suside, #Vijayawada
  • భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

ప్రజాశక్తి-విజయవాడ : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీసు స్టేషన్‌ పరిధి శాంతినగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాయకాపురం శాంతినగర్‌కు చెందిన అంబటి ప్రతాప్‌కుమార్‌ ఫ్లవర్‌ డెకరేషన్‌ చేస్తుంటాడు. అతని భార్య అంబటి సాయికన్య(32) చీటీల వ్యాపారం చేస్తుంటుంది. వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోవడంతో, అవి తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడారు. వారి పిల్లలు చూసి పక్కింటివారికి చెప్పగా వారు వచ్చి దంపతులిద్దరినీ చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారిని పరిశీలించగా సాయికన్య అప్పటికే చనిపోయింది.. ప్రతాప్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. ప్రతాప్‌కుమార్‌ అన్న ప్రదీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.

➡️