బట్టలారేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి

వికారాబాద్‌ (తెలంగాణ) : బంరాస్‌పేట (వికారాబాద్‌-తెలంగాణ) : బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి చెందిన ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా బంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో జరిగింది. బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద బట్టలను ఆరేయడానికి వైరు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో.. వారు కట్టిన తీగకు విద్యుత్‌ ప్రసరించింది. దీంతో కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ కాలనీకి విద్యుత్‌ సరఫరా చేసే నియంత్రికలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️