నేడు సిపిఐ(యం) అత్యవసర సమావేశం

Apr 4,2024 07:14 #CPM AP, #CPM State Committee

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో పోటీచేసే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, సీట్లను ఖరారు చేసేందుకు సిపిఐ(యం) అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశం 2024 ఏప్రిల్‌ ఈరోజు విజయవాడలో జరగనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరు కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వివిధ పార్టీల వైఖరులు, ఇతర వామపక్ష లౌకిక, పార్టీలతో సిపిఐ(యం) ఎన్నికల సర్దుబాట్లపై చర్చించి నిర్ణయాలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు.

➡️