అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 12:44 #Alluri District, #Campaigning, #cpm

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సిపిఎం ఎంపీ అభ్యర్థి అప్పలనర్స ని గెలిపించాలని సిపిఎం మండల నాయకులు సబన్న సునీల్‌ కుమార్‌, నరేష్‌, శ్రీను ముమ్మర ప్రచారం చేశారు. సిపిఎం కి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ మారుమూల గ్రామాల్లో విస్తఅత ప్రచారం నిర్వహించారు. అత్యధికముగా యువత మేల్కనాలని గతపాలకుల దుర్మార్గపు చేష్టలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి కరపత్రాలు, గోడపత్రికలు అంటించారు. మారేడుమిల్లి మండలం సున్నంపాడు గ్రామంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థికి గిరిజన మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. కళాకారులు నృత్య ప్రదర్శనలు చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

➡️