నేటి నుండి సెంట్రల్లో ‘సిపిఎం జన శంఖారావం’

విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి – వైసిపిలను గద్దె దించండి… నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..’ నినాదంతో వారం రోజులపాటు సెంట్రల్‌ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వం వహించే ఈ పాదయాత్ర ఉదయం 61వ డివిజన్‌లో, సాయంత్రం 62, 63, 64 డివిజన్‌లో సాగుతుంది. 23వ తేదీ ఉదయం 29, 27, 28, సాయంత్రం 1వ డివిజన్‌ (మూడు కట్టలు)లోనూ, 25వ ఉదయం 58, 59 జి+3, సాయంత్రం 60, 61 డివిజన్లలోనూ కొనసాగుతుంది. 26వ ఉదయం 30, 32 సాయంత్రం 58వ డివిజన్‌ ఇందిరా నాయక్‌ నగర్‌, 57వ డివిజన్లలో జరుగుతుంది. 27వ ఉదయం 23, 24, 25 డివిజన్లలో సాగుతుంది.

➡️