‘బిల్లులు’ వెనక్కు తీసుకోవాలి : సిపిఎం డిమాండ్

cpm on smart meters bill to pump sets

ప్రజాశక్తి-విజయవాడ : వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి రైతులకు బిల్లులు పంపడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లులను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కొనసాగించాలని, స్మార్ట్‌ మీటర్లను తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు ఛార్జీల చెల్లింపులకు బ్యాంకు అకౌంట్‌ వివరాలు సేకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణం ఈ ప్రక్రియను ఆపాలని వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

➡️