ఎన్నికలప్పుడు వచ్చే వారిని ప్రశ్నించాలి : సిపిఎం

Apr 16,2024 15:15 #cpm pracharam, #gannavaram

ప్రజాశక్తి-గన్నవరం : ఎన్నికలప్పుడు ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని అడుగుతున్న వారిని ప్రశ్నించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎనికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పెద అవుటపల్లి గ్రామంలోని ముస్లిం పేటలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలను కలుసుకొని సమస్యలు అడగ్గా రోడ్లు వేయలేదని, వర్షం పడితే చెరువుల మారి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలబడి దోమలు దాడులు చేస్తున్నాయని తెలిపారు. రోగాలు వచ్చి ఆసుపత్రికి వెళితే సరిగా చూడడం లేదని మహిళలు పేర్కొన్నారు. మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయకులు వస్తున్నారు? మాయ మాటలు చెబుతున్నారు కానీ పనులు చేయడం లేదని తెలిపారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకలను నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే మోడీ రాజ్యాంగం అమలవుతుందని హెచ్చరించారు.
సిపిఎం ఉంగుటూరు మండల కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళ్ళం అభివఅద్ధికి మలుపు అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడానికి సిపిఎం పాటు పడుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి, పంటపొలాలకు సాగునీరు అందించేందుకు కఅషి చేస్తారన్నారు. ఇండియా వేదిక బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పవన్‌,పార్టీ నాయకులు పిల్లి రాజారావు, కడవకొల్లు రామరాజు, మాగంటి సాంబశివరావు,సలీమ్‌,వెన్నుతల సర్పంచి తెల్లాకుల రామ మోహనరావు, సీతారామరాజు పాల్గొన్నారు.

➡️