దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

cpm vsr on suspension mps parliament
  • పార్లమెంట్‌లో 141 మంది సస్పెన్షన్లపై 
    ఈనెల 22న దేశ వ్యాప్త నిరసన
    స్టీల్‌ప్లాంట్‌ స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులే: ఆదానీ, టాటా, జిందాల్‌లు కాదు
    3వ ఫర్నేస్‌ను సెయిల్‌ ద్వారా నడపాలి
    పార్లమెంట్‌లో దారుణాలపై యువగళంలో ఎలుగెత్తాలి

ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగ 141 మంది రాజ్యసభ, పార్లమెంట్‌ సభ్యులను సస్పెన్షన్‌కు గురిచేయడం సిగ్గుచేటైన విషయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. బుధవారం ఉదయం 10గంటలకు విశాఖలోని జగదాంబ జంక్షన్‌ సిఐటియూ కార్యాలయంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తో కలసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విఎస్సార్‌ మాట్లాడుతూ దుశ్ఛర్యపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం ఎంపీలు కనీసం స్పందించకపోవడం దారుణమైన విషయమని ఆయన ఖండిరచారు. వైసిపి పూర్తిగా బిజేపితో అంటకాగుతోందన్నారు. ఏపిలో ప్రజాస్వామ ్య హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో నిరంకుశతÊంవం రాజ్యమేలుతుంటే మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ`విజయనగరం సమీపంలోని పోలిపల్లిలో లోకేష్‌ యువగళం సభలోనైనా టిడిపి నేతలు పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక పోకడలపై గళమెత్తాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ రెండు పార్టీలు పార్లమెంట్‌లో తటస్థంగా ఉన్నామని చెబుతూనే బిజేపికి మద్దతునిస్తున్నాయన్నారు. కనీసం ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడడానికి, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ సాధించడానికి ఈ రెండు పార్టీలు కృషిచేయాలని, రెండు రోజుల్లో ఈ 2 పార్టీలు తమ స్పందనను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలుండి ప్రధాన ప్రజా సమస్యలకు ఈ దుస్థితి పడుతుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
నీనెల 22న దేశ వ్యాపిత ఇండియా నిరసన: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిరసనగా ఈనెల 22న దేశ వ్యాప్తంగా ఇండియాలోని అన్ని పార్టీలు కలసి నల్లజెండాలు, నల్ల బెలూన్లతో నిరసనలు తెలియజేస్తామని ఆయన వెల్లడిరచారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్వహించే చర్చలు, సంప్రదింపులకు స్టేక్‌ హోల్డర్లంటూ అదానీ, టాటా, జిందాల్‌ను పిలవడమేనిటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌కు స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులేనని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని 3వ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను సెయిల్‌ ద్వారా ప్రారంభింపజేయాలని, ఎన్‌ఎండిసి ద్వారా గనులు ఇప్పించే పని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేయాలని అందుకు ఎంపీలంతా పార్లమెంట్‌లో గళమెత్తాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, ఇతర విద్యాశాఖ ఉద్యోగుల సమ్మె, నిరసనలను విరమింపజేసే బాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. అక్కచెల్లెమ్మలంటూనే అంగన్‌వాడీ సెంటర్ల గుండెలపై తన్నే విధానాన్ని జగన్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ యూనియన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పంటలు నష్టపోయి రైతులుంటే ఎంత నష్టం జరిగిందో గణనకు రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులను నియమించకుండా అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగుల గొట్టే బాధ్యతను అప్పగించడం జగన్‌ సిగ్గుపడాలన్నారు.

➡️