తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : సిపిఎం

cpm wishes to pongal

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చగా ఉండాల్సిన పల్లె సీమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలతో కునారిల్లుతున్నాయని పేర్కొన్నారు. దానికి తోడు కరువు కాటకాలు, వరదలు ముంచెత్తి నడ్డి విరగ్గొడుతున్నాయని వెల్లడించారు. రైతులు, కూలీలు సహాయం కోసం ఎదురు చూసి నిరాశపడుతున్నారని తెలిపారు. ఇంకోవైపు లక్షమందికి పైగా ఉన్న అంగన్‌వాడీలు సంక్రాంతి లోపు తమ సమస్య పరిష్కారమవుతుందని ఎదురు చూసి ప్రభుత్వ మొండి వైఖరితో నిరాశ చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించి సంతోషంగా వారి కుటుంబాలతో సంబరాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరూ అంగన్‌వాడీలకు అండగా నిలబడాలని, సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో ఆకాంక్ష వ్యక్తం చేశారు.

➡️