ప్రచారానికి తెర… ప్రలోభాల ఎర : తెలంగాణాలో రేపు పోలింగ్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. గత రెండు వారాలుగా హోరెత్తించిన ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. వారం రోజులుగా తెలంగాణలో మకాం వేసిన ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నాయకత్వం ఢిల్లీ బాట పట్టింది. స్థానిక సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం నినాదంతో కమ్యూనిస్టు పార్టీలు తమ వాణిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్‌, సుస్థిర ప్రభుత్వ నినాదంతో బిఆర్‌ఎస్‌, బిసిలకు సిఎం పదవి హామీతో బిజెపి నేతలు జోరుగా ప్రచారం చేశారు. బిఎస్‌పి అభ్యర్థులు కూడా తమ పార్టీ విధానాలతో ప్రజల ముందుకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడడంతో తెలంగాణ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చినట్లు సిఇఒ వికాస్‌రాజ్‌ తెలిపారు. గడువు ముగిసిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదని ఇసి స్పష్టం చేసింది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు సిఇఒ తెలిపారు. తెలంగాణ ఎన్నికలను అధికార బిఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయా మిగతా 7లో

➡️