రాబోయే ఎన్నికలలో పోటి చేస్తా : మంత్రి రోజా

Dec 19,2023 11:54 #Minister Roja

ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్‌ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు టికెట్‌ రాదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని విరుచుపడ్డారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కే సీట్లు లేకుండా రెండేసీ నియోజకవర్గాలలో సర్వే చెయ్యించుకుంటున్నారని తెలిపారు. నగరి నియోజకవర్గానికి చాలా చేసాను అని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆ సీటు విషయంలో గ్యారంటీగా ఆ టికెట్‌ నాకే వస్తుంది అందులో సందేహం లేదన్నారు.

➡️