డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత

హైదరాబాద్‌ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడిగా పని చేస్తున్న వెంకటేశ్వరరావు కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో, ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం కన్నుముశారు. సోదరుడి మరణంతో భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

➡️