వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ … ఇటీవల జరిగిన పరిణామాలు బాధించాయన్నారు. వైసిపి ఆవిర్భావం నుంచి సేవ చేశాననీ.. పార్టీ కోసం కష్టపడ్డామని.. పోరాడామని.. మాది అనుకున్నామని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. తనను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలు, నాయకులకు కఅతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

➡️