విశాఖలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

Dec 18,2023 15:20 #visakhapatnam
  •  ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో లంకే బిందలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగులు గొయ్యి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు? ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల రోజుల నుంచి పూజల మాటున తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికలు తెలిపారు. చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్ళు దేవుడు పాటలు పెట్టుకొని కోటేశ్వరరావు చుట్టూ పక్కల వాళ్ళని ఏమార్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళలు వేసి మహిళలు పరారు అయ్యారు. దోష నివారణ కోసం పూజలు చేసామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామిజీ చెప్పినట్లు చేస్తున్నాను అని కోటేశ్వరరావు అనే వ్యక్తి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️