ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒగా డికె బాలాజీ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా డికె బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మంగళగిరి ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టరుగా విధులు నిర్వహించిన ఆయన ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒగా బదిలీపై వచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను త్వరితగతిన అందజేస్తామన్నారు.

➡️