మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు..

Apr 29,2024 11:55 #Campaigning, #Don't come, #Villagers

పూతలపట్టు (చిత్తూరు) : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌ కుమార్‌ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం చేశారు. డిఎస్పి రాజగోపాల్‌ రెడ్డి భారీ పోలీసు బందోబస్తు నడుమ వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ గ్రామంలోని కొందరికి ఆసరా పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని.. గతంలోని తమ గ్రామంలోని కొంతమంది పై అక్రమ కేసులు కూడా పెట్టారంటూ … నిరసనగా తమ గ్రామంలోకి వైసిపి ప్రచారానికి రాకూడదని గ్రామస్తులు పట్టుబట్టారు.

➡️