మల్కాపురం సిఐ సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగర పరిధి మల్కాపురం లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిఐగా పనిచేస్తున్న ఎన్‌.సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు పడింది. విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా కొయ్యలాడ వెంకటేశ్వర జగదీష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తనను రౌడీ షీటర్‌ కౌన్సెలింగ్‌ కోసం మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌కు సిఐ పిలిచారని, మిగతా రౌడీ షీటర్లందరినీ పంపించిన తర్వాత తనను పోలీస్‌ స్టేషన్‌ భవనంలోని మొదటి ఫ్లోర్‌పైకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి దూషించారని ఎన్నికల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై వీడియో క్లిప్‌/ఆడియో క్లిప్‌ ఆధారంగా నగర పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ విచారణ చేపట్టారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా సిఐని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

➡️