గొంతెత్తిన కర్షక, కార్మిక లోకం

– మోడీ విధానాలపై పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌

– రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌, ఆటో ర్యాలీలు

– మూడపడిన పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు

విశాఖలో ప్రదర్శన అడ్డగింత

– పలువురి అరెస్టు, విడుదల

ప్రజాశక్తి – యంత్రాంగం: కార్మిక, కర్షక లోకం గొంతెత్తింది. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు, కార్మిక, వ్యతిరేక విధానాలపై గర్జించింది. కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్‌ బిల్లు రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేసింది. కార్మికులు చేపట్టిన ప్రదర్శనలు, బైక్‌, ఆటో ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు మారుమోగాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె విజయవంతమైంది. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు,దుకాణాలు మూతపడ్డాయి. రాజధానిలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు.విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఆయిల్‌ పరిశ్రమలు, షిప్‌యార్డు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బిహెచ్‌ఇఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సమ్మె జరిగింది. లారీలు నిలిచిపోయాయి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. కార్మికులను అణగదొక్కే బిజెపి చర్యలను ఎంత మాత్రమూ సహించేది లేదన్నారు. దాదాపు 30 సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఆర్‌.లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న ట్రాన్స్‌పోర్టు రంగంపై వివిధ చట్టాలతో మోడీ సర్కారు దాడి చేయడాన్ని ఖండించారు. ఎఐటియుసి నాయకులు జెవి.సత్యనారాయణ మూర్తి, ఐఎఫ్‌టియు నాయకులు ఎం.లక్ష్మి పాల్గన్నారు.

సమ్మెలో భాగంగా మధురవాడలో కార్మికులు ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టగా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడిచిపెట్టారు. గాజువాకలో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, సభ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి నెహ్రూ చౌక్‌ మీదుగా ఆర్‌డిఒ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.అల్లూరి జిల్లా రంపచోడవరంలో దుకాణాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్‌ సందర్భంగా రంపచోడవరం, చింతూరు, విఆర్‌.పురం కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించారు.

విజయవాడలో పాత బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ఆటోల ప్రదర్శన ఏలూరు రోడ్డు మీదుగా లెనిన్‌ సెంటర్‌కు చేరుకుంది. అనంతరం నిర్వహించిన సభలో పాల్గన్న నేతలు మాట్లాడుతూ… రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను నేటికీ కేంద్రం నెరవేర్చలేదన్నారు. నూతన విద్యా విధానం పేరిట విద్యా వ్యవస్థను సైతం ధ్వంసం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.రవీంద్రనాథ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు పోలారి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు తదితరులు పాల్గన్నారు.

కర్నూలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి పాల్గని మాట్లాడారు. బిజెపిని, బిజెపికి మద్దతిచ్చే పార్టీలను గద్దె దించడం కోసం కార్మికులు, కర్షకులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, యడ్లపాడులో కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ పాల్గన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్‌ బిల్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ జాతీయ రహదారి వద్ద నిర్వహించిన రాస్తారోకోలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకాయలపాటి శివనాగరాణి ప్రసంగించారు. రాజధాని ప్రాంతంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా కార్యాలయం ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, పరిశ్రమలు, రవాణా రంగం, నిర్మాణ రంగ కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రైతులు, కార్మికులు నిరసన తెలిపారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ పాల్గన్నారు. అనంతపురం బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు పాల్గన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కోరమాండల్‌, ప్యారీ సుగర్స్‌, శ్రీ సాయి, ఆదాని ఆయిల్‌ కంపెనీ, స్లంబ్రీజర్‌, జెమిని, సంతోషిమాత, లోహిత, ఎన్‌ఎస్‌ఎస్‌ కంపెనీల కార్మికులు సమ్మెలో పాల్గన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి ప్రసంగించారు.

తిరుపతిలో ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి పూర్ణకుంభం సర్కిల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో రైతులు ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి,కడప జిల్లాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి జిటి రోడ్డు మీదుగా సూర్యమహల్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.

దేశవ్యాప్త సమ్మె సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ నుండి కొటగుమ్మా వరకు ర్యాలీ

 

మంగళగిరిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
మంగళగిరి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక, రైతులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక బంద్ లో పిలుపులో భాగంగా శుక్రవారం మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు, ఏఐటీయూసీ, ఏఐ ఎఫ్ టు యు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, స్థానిక సిఐటియు, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం కామెంట్స్ :

నెల్లూరు నగరంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేశారు‌. భారత దేశంలో చరిత్ర ఆత్మకమైన దినం.
నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని అన్ని పంటలకు స్వామినాథన్ సిఫారసు మేర కనీస మద్దతు ధర నిర్ణయించి ధరలను అమలుపరిచే విధంగా పార్లమెంటులో చట్టం తేవాలి. ఆహార భద్రత చట్టాన్ని వెంటనే అమలుపరచాలని రైతుల రుణాలు మాఫీ చేయాలి.

ఏలూరు : ఈ-చలానాలను రద్దు చేయాలని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరు నగరంలో ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది

నెల్లూరు జిల్లా-బుచ్చిరెడ్డిపాళెం : సిఐటియు ఆధ్వర్యంలో గ్రామీణ బంద్ లో భాగంగా శుక్రవారం కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ

 

గుంటూరు జిల్లా : తుళ్లూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ… ర్యాలీకి మద్దతు తెలిపిన అమరావతి రైతులు, మహిళలు

అనంతపురం జిల్లా : దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె – గ్రామీణ బంద్ సందర్భంగా గుంతకల్లులో కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన.

ఐక్యపోరాటాలు నిర్వహించాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు
శ్రీకాకుళం జిల్లా  – రణస్థలం : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరం నుండి రణస్థలం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రణస్థలంలో రామతీర్థం జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేసారు.

విశాఖ : కేంద్ర బిజెపి కార్మిక, కర్ధక వ్యతిరేక విధానాలకు నిరసనగా తగరపువలస జంక్షన్ లో సి పి ఎం, సి పి ఐ ఆధ్వర్యన మానవహారం

విశాఖ : పద్మనాభంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేస్తున్న గంగారావు, రవ్వ నర్సింగరావు

farmers rural bandh against modi govt eluru a

ఏలూరు జిల్లా : కొయ్యలగూడెం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో కొయ్యలగూడెం సంతమర్కెట్ వద్ద సీ.ఐ.టీ.యూ, ఏ.ఐ.టి.యు.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, ఎ ఐ కే కే ఏస్. డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షులుగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శుక్ల బోయిన రాంబాబు వ్యవహరించారు.

ఏలూరు జిల్లా : మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మె గ్రామీణ బంధు సందర్భంగా ఏలూరులో భారీ ర్యాలీ, పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో

farmers rural bandh against modi govt ntr

మైలవరంలో గ్రామీణ బంద్

మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : దేశ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంద్ శుక్రవారం మైలవరంలో ప్రశాంతంగా జరిగింది. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ సుప్రజ, సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ సుధాకర్, సిపిఎం మండల కార్యదర్శి రావు రమేష్ బాబు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రావుల సుబ్బారావు, వజ్రాల వెంకటరెడ్డి, కౌ లు రైతుసంఘం మండల కార్యదర్శి సందీ పాము ఇసాక్, ఆశ వర్కర్స్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు ముఠావర్కర్ నాయకులు పాల్గొన్నారు.

farmers rural bandh against modi govt nlr

నెల్లూరు జిల్లా : ఉలవపాడులో గ్రామీణ బంద్

May be an image of 3 people, tree, crowd and text

అనకాపల్లి : కేంద్ర బిజెపి-మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన అఖిల భారత శ్రామిక సమ్మె, గ్రామీణ బంధు సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో అనకాపల్లి సిఐటియు కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ధర్నా చేస్తున్న కార్మిక, రైతు సంఘాలు.

 

గ్రామీణ సమ్మెలో భాగంగా ర్యాలీ  

కృష్ణా జిల్లా – రెడ్డిగూడెం: దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో భాగంగా రెడ్డిగూడెం మండల కేంద్రంలో రైతులు, కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు కొండపల్లి పరమేశ్వరరావు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు యం మాధవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి నల్ల చట్టాలు తీసుకురావడం జరిగిందని ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయటం, కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్లకు దోచిపెట్టడం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, బాబు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

విశాఖ : అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్కు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రాలి సిఐటియు నాయకులు లక్ష్మణరావు, ఆర్ కే ఎస్ వి కుమార్,  జెవి సత్యనారాయణమూర్తి, లక్ష్మి రాజు నూకరాజు

గుంటూరు జిల్లా : ముప్పాళ్ల మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా

గుంటూరు జిల్లా : గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం గుంటూరులో సిఐటియు, ఏఐటీయూసీ, ఐ ఎఫ్ టి యు, రైతు సంఘాలు, వివిధ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు.

చిత్తూరులో గాంధీ విగ్రహ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతు, కార్మిక సంఘాల నేతలు

farmers strike against modi govt manyam

పార్వతీపురం మన్యం జిల్లాలో…

farmers strike against modi govt

గ్రామీణ బంద్ లో భాగంగా రోడ్డుపై నిరసన తెలుపుతూ…

ప్రకాశం జిల్లా : గ్రామీణ బంద్ లో భాగంగా ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు

అనంతపురం జిల్లా : చిలమత్తూరులో గ్రామీణ బంద్ కు మద్దతుగా సిపిఎం ఆద్వర్యంలో రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులు

పశ్చిమ గోదావరి జిల్లా-నరసాపురం: కేంద్ర మోడీ ప్రభుత్వ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు,కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నరసాపురం లో నిరసన వ్యక్తం చేశారు. బస్ స్టాండ్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ లో నిరసన తెలియజేశారు.

అనంతపురం జిల్లా :

 

మార్టూరులో స్వచ్ఛందంగా బంద్

బాపట్ల జిల్లా – మార్టూరు రూరల్ : కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా,కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు మార్టూరులో పలు వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

 

విజయనగరం జిల్లా : నెల్లిమర్లలో వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్త బంద్ లో భాగంగా రాస్తారోకో

ఏలూరు జిల్లా : చాట్రాయి సెంటర్లో గ్రామీణ సమ్మె  నిర్వహిస్తున్న ప్రజా సంఘాలు

ఎన్టీఆర్ జిల్లా : వీరులపాడు మండలం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

ప్రకాశం జిల్లా :  గ్రామీణ భారత్ బందులో భాగంగా దొనకొండలోని కెనరా బ్యాంకు పోస్ట్ ఆఫీస్ ను సిఐటియు ఆధ్వర్యంలో చెరుపల్లి అంజయ్య నేతృత్వంలో ఈరోజు ఉదయం బంద్ నిర్వహించడం జరిగింది .

ప్రకాశం జిల్లా : గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మెలో భాగంగా శిoగరాయకొండలో కార్యక్రమం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కార్యాలయం బందులో సందర్భంగా మూత వేయించి.ర్యాలీ నిర్వహించారు.

అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామంలో గ్రామీణ బంధ్

➡️