ఓఆర్‌ఆర్‌ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరువురు మృతి

Feb 20,2024 11:15 #hydrabad, #road accident

హైదరాబాద్‌: నార్సింగ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ప్రయణిస్తున్నారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్సింగ్‌ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రలును సమీప ఆస్పత్రికి తరలించి, మత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️