ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం..

Feb 19,2024 16:15 #fire acident, #hydrabad

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

➡️