ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు – 5 నుంచి దరఖాస్తు

Mar 5,2024 08:05 #AP Education, #private schools

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కింద ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమగ్రశిక్షా అభియాన్‌ డైరెక్టరు బి శ్రీనివాసరావు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఈ చట్టం కింద 9,350 సీట్లు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ చేయబడ్డాయని తెలిపారు. ఒకటో తరగతిలో విద్యార్థులు సీట్లు పొందేందుకు మంగళవారం (ఈ నెల 5వ తేదీ) నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలనివెల్లడించారు. ఈ నెల 25 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు నింపాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, నెట్‌ కేంద్రాలు, మీ సేవ కేంద్రాలు, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు. రాష్ట్ర సిలబస్‌ పాఠశాలల్లో చేరేందుకు 2024 జూన్‌ 1వ తేదీ నాటికి ఐదేళ్లు నిండాలని, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబి సిలబస్‌ పాఠశాలల్లో 2024 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ఐదేళ్లు నిండి ఉండాలని వివరించారు. మరినిు వివరాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 18004258599ను సంప్రదించాలని సూచించారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకురూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.1.44 లక్షలు మించరాదనిపేర్కొనాురు.

➡️