టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా

Mar 14,2024 17:27 #Gandhi Babji, #resigns, #TDP, #visaka

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీకి విశాఖ వెస్ట్‌ నియోజకవర్గ ఇన్ఛార్జీ గండి బాబ్జీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. టీడీపీ తొలి జాబితాలో గండి బాబ్జీకి చంద్రబాబు టికెట్‌ కేటాయించలేదు. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ఆయన ఆశించారు. అయితే, సెకండ్‌ లిస్ట్‌లో కూడా తనకు టికెట్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్‌ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని గండి బబ్జీ తెలిపారు.

➡️