తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు  కృషి చేయాలి : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Jan 5,2024 16:02 #rjamandri, #telugu mahasabhalu

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని గైట్‌ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి వెలిగించి సభలను ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడేందుకు, పిల్లలతో మాట్లాడించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదన్నారు. తెలుగు భాషాభివఅద్ధికి ప్రభుత్వాలు కఅషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌ రాంమాధవ్‌ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదని.. దానికి 2,500 ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెప్పారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ తెలుగు పండగ ఈనెల 7వ తేదీ వరకు జరగనుంది.

➡️