గుడ్లవల్లేరు ఫార్మశీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్‌

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక వివి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సస్‌ కళాశాల అధ్యాపకురాలు వి.రజని కి డాక్టరేట్‌ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేస్తున్న రజిని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు నుండి డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌ డి) పట్టాను అందుకున్నారు. ఫార్ములేషన్‌ ఎవాల్యూయేషన్‌ ఆఫ్‌ బై లేయర్డ్‌ టాబ్లెట్స్‌ ఆఫ్‌ సమ్‌ సెలెక్టెడ్‌ యాంటీ డయాబెటిక్‌ డ్రగ్స్‌ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధన డయాబెటిస్‌ వ్యాధికి నూతన ఔషధాలను రూపొందించడంలో ఎంతో దోహదపడుతుంది. బయోటెక్నాలజీ విభాగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్‌ వై.రాజేంద్రప్రసాద్‌ పర్యవేక్షణలో పరిశోధనా గ్రంధం సమర్పించి డాక్టరేట్‌ పట్టాను అందుకున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఎన్నో వ్యాసాలను పలురకాల జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పత్రికలలో ప్రచురించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు రజని కి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ రావు తో పాటు కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు, వల్లూరిపల్లి, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ వి.సత్యనారాయణ, కో-సేక్రేటరీ అండ్‌ కరస్పాండెంట్‌ వి.రామకృష్ణ, అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.కె అమీనాబీ, డాక్టర్‌ పి.రవిష, డాక్టర్‌ టి.ప్రశాంతి, డాక్టర్‌ టి.బాలకృష్ణ, డాక్టర్‌ టి.బాలకృష్ణ, టి.శ్రావణి, ఎ.సాయి ధాత్రి, విఎల్‌.వినోద్‌ కుమార్‌, కె.పరిమళ, తదితరులు శుభాభినందనలు తెలిపారు.

➡️