తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవు

Dec 18,2023 15:35 #ministers, #Telangana
  •  ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా, ఇంత నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. మేడిగడ్డ ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు.

➡️