తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Feb 28,2024 10:23 #inter exams, #started, #Telangana

తెలంగాణ : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 4,78,718, రెండో సంవత్సరంలో 5,02,260 మంది హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా కాపీ కొట్టినా.. ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

➡️