ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Mar 3,2024 10:56 #inter student, #Suicide

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తల్లిదండ్రులు మందలించారని ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటకు చెందిన పుల్లంశెట్టి నాగరాజు కుమారుడు బన్షీ (17) పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం తొలిపరీక్ష రాసిన అనంతరం ఇంట్లో టివి, సెల్‌ఫోన్‌ చూసుకుంటూ ఉండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బన్షీ.. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని, ప్రయోజకుడిని అయి వస్తానని లెటర్‌ రాసి వెళ్లిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సాయంకాలం కొండమోడు వద్ద గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే గూడ్స్‌ రైలు కింద పడి బన్షీ ఆత్మహత్య చేసుకున్నారు. కొండమోడు వద్ద విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో తల్లిదండ్రులు గుర్తించి, మృతదేహం తమ కుమారుడిదేనని గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. నీళ్లు అడిగితే చంపేస్తారా?శ్రీ పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన బాణావత్‌ సామునిబాయి ట్యాంకర్‌ దగ్గర నీళ్లుపట్టుకునేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీల వాళ్లు పట్టుకోరాదంటూ అడ్డుపడి, చివరికి ట్రాక్టర్‌తో ఢ కొట్టి చంపిన ఘటన తనను కలచి వేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి వాళ్లే నీళ్లు తాగాలి, గాలి పీల్చాలని జీఓ ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందని పంచ భూతాలకు రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతుందన్నారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

➡️