తెలంగాణ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు

Feb 18,2024 12:00 #it raids, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్‌ ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్‌లో ఉన్న శ్రీరాములు యాదవ్‌ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీరాములుతో పాటు ఆయన పీఏ ఇంట్లోనూ అధికారలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారుల ఆకస్మిక తనిఖీలకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. లోక్‌ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

➡️